
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌లో లవ్ చేసి… పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య చేయడమే కాకుండా.. బాడీని ముక్కలు చేసి.. డ్రమ్ములో వేసి కాంక్రిట్‌లో కూర్చేసిన ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. తాజాగా మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి ప్రెగ్నెంట్ అని అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. నిందితురాలు ముస్కాన్ రస్తోగికి జైలు మాన్యువల్ ప్రకారం… మెడికల్ టెస్టులు చేయగా… పరీక్షల్లో ఆమె గర్భవతిగా తేలింది. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే?
మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ ఫేజ్ 2కి చెందిన సౌరభ్ కుమార్ 2016లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని ఏళ్లు బాగానే కలిసి జీవించారు. వారి వివాహ బంధానికి గుర్తుగా 2019లో కుమార్తె జన్మించింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ ఆ జాబ్ మానేసి.. బేకరీలో పనిచేసేందుకు లండన్ వెళ్లాడు. ఇంట్లోనే ఒంటరిగా ఉన్న ముస్కాన్‌కు 2019లో మోహిత్ అకా సాహిల్ పరిచయం అయ్యాడు. క్రమంగా వారిద్దరి మధ్య చనువు పెరిగింది. అది వివాహేతర సంబందానికి దారి తీసింది. సౌరభ్ కుమార్ ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం స్వస్థలానికి వచ్చాడు. దీంతో భర్తను చంపాలని ముస్కాన్ డిసైడయ్యింది. ప్రియుడితో కలిసి ప్లాన్ అమలు చేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. అనంతరం సౌరభ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు. సంచలనాత్మకమైన ఈ కేసు దర్యాప్తులో ముస్కాన్ నవంబర్ 2023 నుంచి భర్త హత్యకు ప్రణాళిక వేస్తున్నట్లు వెల్లడైంది.
నిందితులిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ముస్కాన్ జైలులో కుట్టుపని చేస్తుండగా, సాహిల్‌తో వ్యవసాయ పనులు చేయిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..