
మహాశివరాత్రి సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చింది మజాకా సినిమా. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తెరకెక్కించారు. ఇందులో రావు రమేశ్ కీలకపాత్రలో నటించగా.. రీతూ వర్మ కథానాయికగా కనిపించింది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుందని అర్థమైపోయింది. కాగా విడుదల తర్వాత ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా .. పర్లేదు అనిపించుకుంది.
ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో సందీప్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేశ్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే కామెడీ సీన్స్ , ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్స్ గా నటించిన రీతూ వర్మ, అన్షుల అందం, అభినయం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఓవరాల్ గా మజాకా సినిమాకు రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే
తాజాగా మజాకా సినిమా ఓటీటీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. ఉగాది సందర్భంగా మజాకా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 మజాకా సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మార్చ్ 28 నుంచి మజాకా సినిమా జీ 5లో అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.