
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మజాకా. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటించగా.. రావు రమేష్, సీనియర్ హీరోయిన్ అన్షు కీలకపాత్రలు పోషించారు. బెజవాడ ప్రసన్న కుమార్ స్టోరీ అందించిన ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా మంచి వసూళ్ల రాబట్టింది. సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీ టైమింగ్, పంచ్ లు అదరిపోయాయి. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సందీప్ కిషన్ కెరీర్ లో మైలురాయి 30వ సినిమాగా వచ్చిన మజాకా.. ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది.
థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలై నెలరోజులు దాటినా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్న సమయంలో సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఉగాది, రంజాన్ ఫెస్టివల్స్ సందర్భంగా మార్చి 28న నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చింది. ఈ పండక్కి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఇప్పుడు సరదాగా ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూడొచ్చు.
కథ విషయానికి వస్తే..
రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీకొడుకులు. భార్య చనిపోయిన తర్వాత రమణ తన కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు. తన కొడుకుకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. ఇద్దరు మగవాళ్లే ఉండడంతో అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించారు. అదే సమయంలో రమణకు యశోద (అన్షు) ఎదురుపడుతుంది. దీంతో ఆమె ప్రేమలో పడిపోతాడు. మరోవైపు కృష్ణ సైతం తన కాలేజీలో చదివే మీరా (రీతూ వర్మ)ను ప్రేమిస్తుంటాడు. తండ్రీకొడుకుల ప్రేమకథలు వారిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చాయి అనేది సినిమా.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..