
తమిళనాడు ప్రభుత్వం పచ్చి గుడ్లు, నూనెతో తయారు చేసే మయోన్నైస్‌ను నిషేధించింది. రాష్ట్ర వ్యాప్తంగా మయోన్నైస్ అమ్మకాలను పూర్తి స్థాయిలో నిషేధం విధించబడింది. మయోన్నైస్ ఆరోగ్యానికి అధిక ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున ఈ నిషేధం విధించినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ లాల్వేనా తెలిపారు. మయోనైస్‌ను గుడ్లు, నూనె, వెనిగర్ వంటి ఇతర పదార్థాలతో తయారు చేసే ఒక మందపాటి క్రీమీ సాస్. దేనీ ప్రధానంగా సలాడ్ డ్రెస్సింగ్, సాండ్విచ్లలో,ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఉపయోగిస్తారు.
తమిళనాడులో మయోన్నైస్ అమ్మకాలు నిషేధం
ఈ మయోన్నైస్‌ను పెద్ద షాప్స్ తో పాటు రోడ్డు పక్కన ఉన్న స్టాళ్లల్లో కూడా తయారు చేసి విక్రయిస్తారు. ప్రజలు ఈ మయోన్నైస్ తో చికెన్ , శాండ్విచ్ లు తింటారు.
అయితే ఈ మయోన్నైస్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మయోన్నైస్ తినడం వల్ల మరణాలు సంభవించాయి. ఫలితంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మయోన్నైస్ తినడంపై నిషేధం విధించబడింది.
ఇవి కూడా చదవండి
ఇటీవలే తెలంగాణలో మయోన్నైస్ వాడకాన్ని నిషేధించింది. ఇప్పుడు తమిళనాడులో మయోన్నైస్ అమ్మకం నిషేధం విధించబడింది. ఈ ఉత్తర్వు ఏప్రిల్ 8వ తేదీ , 2025 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఆర్.లల్వేనా ఈ మేరకు ప్రకటన చేశారు. మయోనైస్ గుడ్డు పచ్చసొన, నూనె, వెనిగర్ మొదలైన వాటితో తయారు చేస్తారు. ఈ మయోనైస్‌ను షవర్మా వంటి ఆహార పదార్థాలతో కలిపి తింటారు.
నిషేధం విధించడంపై కారణం ఏమిటి?
మయోన్నైస్ తినడం వల్ల అధిక ప్రమాదం ఉంది. ఈ మయోన్నైస్ ను తయారు చేయడానికి పచ్చి గుడ్లను ఉపయోగిస్తారు. అయితే దీనిని తయారీ చేసే విధానం సరిగ్గా లేకపోవడం, నిల్వ చేసే సౌకర్యాలు లేకపోవడంతో ఈ మయోన్నైస్ పై బ్యాక్టీరియా చేరుకుంటుంది. ఇలాంటి మయోన్నైస్ ని తినడం వలన వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.
మయోనైస్‌లో సాల్మొనెల్లా టైఫిమూరియం, సాల్మొనెల్లా ఎంటెరిటిస్, ఎస్చెరిచియా కోలి, లిస్టెరియా మోనోసైటోజెన్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. దీనిని తినడం వలన అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ఆహార దుకాణాల తనిఖీల్లో మయోన్నైస్ తయారీ విధానం సరిగ్గా లేదని తేలిందని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ చెప్పారు. దీని తర్వాత రిటైల్ దుకాణాలు, హోటళ్లలో మయోన్నైస్ అమ్మకాలను నిషేధించారు. ఈ ఆదేశం ఆహార భద్రత,ప్రమాణాల చట్టం, 2006 (కేంద్ర చట్టం 34/2006) లోని సెక్షన్ 30(2)(a) ప్రకారం ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి మయోన్నైస్ అమ్మకాలను జరిపే దుకాణాలకు జరిమానా విధించనున్నామని.. షాప్ లైసెన్స్ కూడా రద్దు చస్తామని.. చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. అంతేకాదు షాప్ యజమానులు శిక్షను ఎదుర్కొంటారు” అని ప్రకటన చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..