
ఈ నెలలో శని, సూర్య కలయిక జరగనుంది. ఈ నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నాయి. శని దేవుడు కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతకంటే ముందు సూర్యుడు ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు శుక్రుడు, బుధుడు కూడా వక్ర మార్గంలో ప్రయాణించనున్నారు. ఈ కారణంగా మార్చి నెలలో కొన్ని రాశులకు అద్భుతయోగాలున్నాయి. మరికొన్ని రాశులకు ధన, ఆరోగ్య నష్టం సూచిస్తోంది. మీ రాశి ఏ విధంగా ఉందో తెలుసుకోండి.
మేషరాశి..
గ్రహాల మార్పు కారణంగా మార్చి నెల మేషరాశి వారికి బ్రహ్మాండంగా కలిసొస్తుంది. శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కెరీర్ పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అన్ని విషయంలో ఉత్సాహంగా ఉండగలుగుతారు. కాన్షిడెన్స్ పెరుగుతుంది. ప్రేమ జీవితం వీరికి బాగుంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ పరంగానే కాకుండా కెరీర్ పరంగానూ విజయావకాశాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారు మేషరాశి గలవారైతే వారికి కచ్చితంగా మంచి ఫలితం సూచిస్తోంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. కోర్టుకు సంబంధించిన కేసులలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు పెండింగులో ఉండే పనులన్నీ పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను లోతుగా విశ్లేషించాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. సూర్య, శని యుతి కారణంగా ఆర్థిక పరంగా బలమైన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్థులకు మంచి ఫలితాలు సూచిస్తుంది.
మిథున రాశి..
జీవితాన్ని కొత్త కోణంలో చూడాల్సిన సమయమిది. భావోద్వేగాలు వదిలిపెట్టడం వల్ల మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని త్యాగాలు అవసరమైతే వెనుకాడొద్దు. ఎందుకంటే అవి దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. డబ్బుకు లోటుండదు. వ్యాపారంలో ధన లాభం సూచితం. తెలివైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఖర్చులను అదుపు చేయడం కూడా ఈ రాశి వారికి చాలా ముఖ్యం.
కర్కాటక రాశి..
కర్కాటకం వారికి మార్చి నెల కలిసొస్తుంది. మానసికంగా మంచి ఉల్లాసంగా కనపడతారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీ ప్రేమ జీవితంలో కూడా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈ కాలంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఓపికతో ఉంటే కొత్త విజయాలను పొందే అవకాశం ఉంది.
సింహరాశి..
కెరీర్ పరంగా మంచి పురోగతి లభించనున్న రాశుల్లో సింహరాశి వారు ముఖ్యంగా ఉన్నారు. మీరు అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారం మొదలుపెట్టాలని వెనకాడుతున్న వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనిలో పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీరు ప్రయాణానికి సంబంధించి శుభవార్తలు వినొచ్చు. ఆరోగ్యం పరంగానూ సింహరాశి వారికి ఎలాంటి చిక్కులు లేవు.
కన్యారాశి..
కన్యారాశి వారు మార్చి నెలలో ఆఫీస్ పాలిటిక్స్ ను తట్టుకుని నిలబడగలగాలి. సహోద్యోగుల మధ్య పోటీ నెలకొంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కానీ మీ ప్రగతిని అడ్డుకునే వారున్నారు జాగ్రత్త. మీకు కొత్త అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఓపికతో పనులు చక్కబెట్టండి. మంచి అవకాశాలు మీ దారికి వచ్చే అవకాశం ఉంది.
తులా రాశి..
తులా వారికి ప్రేమ జీవింత బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం జీవితం అనుకూలంగా ఉంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం మరింత శ్రమించాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి
నమ్మిన వారు మోసం చేయొచ్చు జాగ్రత్త. ప్రేమ సంబంధాలను కాస్త ఓపికతో నిర్వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గుండెకు సంబంధించిన ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఈ నెలలో చాలా ఓపికతో ముందుకు సాగాలి. అప్పుడే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. వ్యాపారస్తులకు బాగుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
ధనుస్సు..
కుటుంబ జీవితం చాలా బాగుంది. ఈ నెలలో అనేక సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. సొంతింటి కల నిజమవుతుంది. సంపదలు పెరుగుతాయి.
మకర రాశి..
మార్చి నెలలో మకర రాశి వారికి కొన్ని కొత్త మార్పులు వస్తాయి. ఈ కాలంలో మీరు చేసే ఏ ప్రయత్నమైనా మంచి విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు ఈ కాలంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రయాణం వల్ల మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆదాయ పరంగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలొస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ కాలంలో మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి.
కుంభరాశి..
శని దేవుడి నిష్క్రమణ కారణంగా ఈ రాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఒడుదుడుకులు ఉంటాయి. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరాశను దరిచేరనీయకండి. ఈ నెలలో మీరు చాలా సంయమనం పాటించాలి. మీ లక్ష్యాల కోసం పనిచేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి..
మీనరాశి వారికి మానసిక ఒత్తిడి సూచనలున్నాయి. సమస్యాత్మక కాలం నడుస్తుంది. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. ఉద్యోగులకు రాజకీయ ఒత్తిడులున్నాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ప్రేమ జీవితం సజావుగా లేకపోవచ్చు. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన కాలమిది.