
మామిడిలో విటమిన్ లు, మినరల్స్ లు ఎక్కువగా ఉంటాయి. మామిడి పండ్లు విటమిన్ సి కి మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. విటమిన్ సి శరీరాన్ని ఇన్ఫెక్షన్, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లు ఫైబర్ కు మంచి మూలం. ఇది మంచి జీర్ణక్రియకు అవసరం. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.