
టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మి ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టిందామె. అంతేకాదు తన పోస్టులకు ఇండిగో సంస్థను కూడా ట్యాగ్ చేసింది.’ నా లగేజ్ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను నా బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. ఇండిగో సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇంకా పచ్చి నిజం మాట్లాడుకోవాలంటేవేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని వరుస ట్వీట్స్ చేసింది మంచు లక్ష్మి. అంతేకాదు తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియోలు సైతం అందులో షేర్ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. మరి వీటిపై ఇండిగో విమానయాన సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది. మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. పైగా తన నివాసాన్ని ముంబై నగరానికి షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా అక్కడే ఉంటోంది.అయితే తన సామాజిక సేవా కార్యక్రమాల కోసం తరచూ హైదరాబాద్ కు వస్తుంటుంది మంచు వారమ్మాయి.
ఇవి కూడా చదవండి
మంచులక్ష్మి వరుస ట్వీట్స్
This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025
They pulled people aside for sleep apnea machine! Spoon fork and knife cutlery ! One of the girl had to leave her luggage cos they couldn’t go thru her bag on time!!!!!!
Ok I’m done! @IndiGo6E loves making you feel violated…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025
I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025