
సాధారణంగా సినీరంగంలో ఒక హీరో మిస్సైన సినిమాను మరో చేయడం సహజం. కొన్నిసార్లు ఒక హీరో ఖాతాలో పడాల్సిన హిట్స్ మరో హీరోకు చేరుతుంది. అలాగే కొన్ని డిజాస్టర్స్ సైతం అందుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అలాంటిందే. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన ఈ సినిమా అనుకోకుండా రామ్ చరణ్ వద్దకు చేరింది. ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. తెలుగు చిత్రపరిశ్రమలో కృష్ణ వారసుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్, రాజకుమారుడు, యువరాజు, మురారి వంటి చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక పోకిరి సినిమా తర్వాత మహేష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.
పోకిరి సినిమాతో అటు మాస్ హీరోగాను ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే మీకు తెలుసా.. మహేష్ బాబు చేయాల్సిన ఓ సినిమా రామ్ చరణ్ వద్దకు చేరింది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చరణ్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? అదే ఎవడు. వంశీ పైడిపల్లి మొదట ఈ సినిమాని మహేష్ బాబుతో తీయాలని భావించారట. అయితే అప్పటికే వరుస సినిమాలతో మహేష్ బాబు బిజీగా ఉండడంతో రెండేళ్లు సమయం పడుతుందని తెలిసిందట. మహేష్ బాబు హీరోగా.. జూనియర్ ఎన్టీఆర్ ను అతిథి పాత్రలో తీసుకోవాలని భావించారట. కానీ ఆ సమయంలో తారక్ ఈ గెస్ట్ రోల్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదట. దీంతో ఈ సినిమా రామ్ చరణ్ వద్దకు చేరింది.
ఈ సినిమాలో మహేష్ బాబు స్థానంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కాజల్, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళీ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు రామ్ చరణ్ పెద్ది మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..