మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని నటిగా సుపరిచితమే. సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఆరోగ్య, ఫిట్నెస్ విధానాలను పంచుకుంటారు. మహేష్ బాబు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని ఆమె తెలిపారు. 14-15 ఏళ్ల వయస్సు నుంచే పండ్లు, గింజలు కొని తెచ్చుకోవడం, ఆరోగ్య పుస్తకాలు చదవడం ప్రారంభించానని చెప్పారు. శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. తన కుటుంబంలో మహేష్ బాబు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని అన్నారు. చిన్నతనంలో తన తల్లి క్యారెట్ జ్యూస్ చేసి ఇవ్వడం ద్వారా వారిలో కూడా ఆరోగ్య స్పృహను పెంచారని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
ఆర్గానిక్ ఆహారం తీసుకోవడం అందరికీ అవసరమని మంజుల చెప్పారు. రసాయన పురుగుమందులను ఆహారంలో, భూమిలో చేర్చడం వల్ల కలిగే తీవ్రమైన హానికరమైన ప్రభావాలను ఆమె వివరించారు. దీనిపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్గానిక్ ఆహారం సాధారణ ఆహారం కంటే కొద్దిగా ఖరీదైనదని ఒప్పుకుంటూనే, డిజైనర్ బ్యాగులు లేదా బట్టలపై లక్షలు ఖర్చు చేసేవారు, ఆరోగ్యం కోసం కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడానికి వెనుకాడటం హాస్యాస్పదంగా ఉందని మంజుల ఘట్టమనేని అన్నారు. శరీరాన్ని దేవాలయంతో పోల్చి, దానిని సంరక్షించుకోవడం మన బాధ్యత అని, ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఖర్చు చేయడాన్ని రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
ఉదయం సూర్యరశ్మి కళ్ళపై పడినప్పుడు, అది మెదడుకు రోజు ప్రారంభమైందని సంకేతం ఇస్తుందని, దీనివల్ల శరీరం సమతుల్యం అవుతుందని, శక్తివంతంగా మారుతుందని చెప్పారు. దీన్ని సర్కేడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ అని పిలుస్తారని ఆమె తెలిపారు. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు రంగు కాంతిని చూడటం మనస్సును ప్రశాంతపరుస్తుందని అన్నారు. అలాగే మహేష్ సైతం ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని.. నిత్యం గంటపాటు కఠినమైన వ్యాయామాలు చేస్తారని అన్నారు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
