ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. అందులో మహేష్ ఎత్తుకున్న ఓ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఆ చిన్నారి మరెవరో కాదు.. హీరోయిన్ శ్రీదివ్య.
అచ్చ తెలుగమ్మాయి. చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాఫ్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతోపాటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ త్రోబ్యాక్ ఫోటో ఆ సినిమాలోనిదే. ప్రస్తుతం శ్రీదివ్య నెట్టింట చాలా యాక్టివ్.