
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
నార్నే నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్-1 కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి మ్యాడ్-2 దానికి మించి ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
రామ్ నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మొదటి సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియాకి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” అన్నారు.
ఇవి కూడా చదవండి
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. “మ్యాడ్ ను పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దానిని మించి ఉండబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను. కళ్యాణ్ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. మునుముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి, చినబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలూ భవిష్యత్ లో పెద్ద స్టార్ లు అవుతారు. పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మార్చి 29న విడుదలవుతున్న మా మ్యాడ్ స్క్వేర్ సినిమాని చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..