

దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీనితో పాటు.. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం కూడా ఈరోజున సంభవించింది. ఈ చంద్ర గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఇది సింహ రాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడింది. దీనితో పాటు హోలీ రోజున గ్రహాలకు అధినేత అయిన సూర్యుడు మీన రాశిలో సంచారము చేస్తాడు. దీంతో ఈసారి హోలీ రోజున చాలా ప్రత్యేకమైన యాదృచ్చికాలు ఏర్పడుతున్నాయి. ఈ చంద్రగ్రహణం వలన కలిగే దుష్ప్రభావాలను నివారించడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం..
భారతదేశంలో కనిపించని చంద్రగ్రహణం
జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ప్రారంభానికి 8 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు. పూజ గది తలుపులు మూసివేయాలి. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈసారి హోలీ రోజున చంద్రగ్రహణ ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఎందుకంటే మన దేశ కాలమానం ప్రకారం ఈ చంద్ర గ్రహణం పగటి సమయంలో ఏర్పడింది. కనుక ఈ గ్రహణ సూతక కాలం కూడా చెల్లదు. హిందూ మతంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలను అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో శుభప్రదమైన పనులు చేయరు.
చంద్ర గ్రహణ సమయం ఎప్పుడంటే
ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం ఈరోజు అంటే మార్చి 14న ఉదయం 09:29 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:29 గంటలకు ముగిసింది. సనాతన ధర్మ విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం వల్ల మంచిది కాదు. శుభ ఫలితాలు రావు. కనుక చంద్రగ్రహణం వలన కలిగే అశుభ ప్రభావాలను నివారించాలనుకుంటే.. ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోవడం వలన చంద్రగ్రహణం వలన కలిగే అశుభ ప్రభావం తొలగిపోతుందని.. అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఏమి చేయాలి?
- చంద్రగ్రహణం ముగిసిన తర్వాత.. పవిత్ర స్నానం చేసి, గంగా జలాన్ని చల్లడం ద్వారా ఇల్లు, ఇంట్లోని పూజ గదిని మొత్తం శుద్ధి చేయండి.
- తరువాత ఇంట్లోని పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి, దేవుళ్లను పూజించండి.
- తర్వాత గుడికి వెళ్లి బియ్యం, పాలు, తెల్లని వస్త్రాలను ఆలయంలోని పూజారికి లేదా పేదలకు దానం చేయాలి.
- ఈ పనులు చేయడం ద్వారా చంద్రగ్రహణం వలన కలిగే అశుభ ప్రభావం తొలగిపోయి ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు.
- దీనితో పాటు గ్రహణం విడిచిన తర్వాత దానం చేయడం వల్ల జాతకంలో చంద్ర దోష సమస్య తొలగిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు