
'దాన వీర శూర కర్ణ'.. 1977లో విడుదలైన తెలుగు భాషా హిందూ పౌరాణిక చిత్రం. దీనిని ఎన్.టి. రామారావు మూడు పాత్రల్లో నటిస్తూ, దర్శక నిర్మాణం వహించిన చిత్రం. ఇది అతని సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో నిర్మితమైంది. అప్పట్లో భారతీయ చలనచిత్ర సంచలంగా నిలిచింది ఈ చిత్రం. ఇది మొత్తం 226 నిమిషాలు (3 గం 46 నిమిషాలు) నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
1963లో సి. పుల్లయ్య, సి. ఎస్. రావు దర్శకత్వంలో వచ్చిన హిందూ పౌరాణిక చిత్రం 'లవ కుశ'. ఈ కథ రామాయణంలోని ఉత్తర కాండ ఆధారంగా, రాముడు, సీతల కవల కుమారులు లవకుశులపై దృష్టి సారించింది. తారాగణంలో రాముడిగా ఎన్. టి. రామారావు, సీతగా అంజలి దేవి, చిత్తూరు నాగయ్య, కాంతారావు, శోభన్ బాబు, ఎస్. వరలక్ష్మి, కైకాల సత్యనారాయణ సహాయక పాత్రల్లో నటించారు. ఇది చిత్రం 208 నిమిషాలు (3 గం 28 నిమిషాలు) నిడివి ఉంది.
1957లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి నటించిన తెలుగు స్వాష్‌బక్లర్ చిత్రం 'సువర్ణ సుందరి'. దీనికి పి. ఆదినారాయణరావు సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అంజలి పిక్చర్స్ బ్యానర్‌పై ఆదినారాయణరావు నిర్మించారు. దీని లెంగ్త్ విషయానికి వాస్తే.. 204 నిమిషాలు (3 గం 23 నిమిషాలు) ఉంది.
1965 హిందూ పౌరాణిక చిత్రం 'పాండవ వనవాసం'. ఇందులో భీముడిగా ఎన్. టి. రామారావు, ద్రౌపదిగా సావిత్రి, దుర్యోధనుడిగా ఎస్. వి. రంగారావు, గుమ్మడి, ఎం. బాలయ్య, ప్రభాకర్ రెడ్డి మరియు మిక్కిలినేని నటించారు. దీనిని కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించగా, సముద్రాల సీనియర్ రచించారు. ఎ. ఎస్. ఆర్. ఆంజనేయులు నిర్మించిన ఈ చిత్రం మహాభారతం ఆధారంగా రూపొందించబడింది. ఇది 198 నిమిషాలు (3 గం 18 నిమిషాలు) ఉంది.
'పాతాళ భైరవి'..1951లో విడుదలైన ఫాంటసీ చిత్రం. కె. వి. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పింగళి, కమలాకర కామేశ్వరరావులతో కలిసి రచయితగా పనిచేశారు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రాన్ని విజయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగి రెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇందులో ఎన్. టి. రామారావు, ఎస్. వి. రంగారావు, కె. మాలతి నటించారు. 195 నిమిషాలు (3 గం 15 నిమిషాలు) నిడివి ఈ మూవీ విడుదల అయింది.
1974లో వచ్చిన తెలుగు బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. దీనిని వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా త్రిపురనేని మహారధి రచించారు. ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల, జగ్గయ్య నటించారు. దీనిని పద్మాలయ స్టూడియోస్ నిర్మించింది. సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రంగా 187 నిమిషాలు (3 గం 7 నిమిషాలు) నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.