
దారం కాని దారంతో తయారు చేస్తూ, చైనీస్ మాంజాస్‌కు దీటుగా అమ్ముడౌతున్న లోకల్ మాంజాలు కూడా ప్రాణాలు తీస్తున్నాయ్. చుట్టుకుంటే చాలు నెత్తురోడాల్సిందే. పీకలు తెగిపోవాల్సిందే. చేతులైనా, కాళ్లయినా కట్టయిపోవాల్సిందే. మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ మాంజాకు నిజంగానే అంత పదునుంటుందా? నైలాన్ సింథటిక్ ఫైబర్‌తో తయారై, గాజుపొడి- లోహపు చూర్ణం పూత పూసి మాంజాలివి. జస్ట్ అలా తగులుకుంటేనే చాలు మనిషి చర్మమేంటి.. ఏదైనా ఇంతే. జస్ట్ శాంపిల్ చూడ్డం కోసం చికెన్, మటన్ ముక్కల మీద మాంజాల్ని ప్రయోగించి, వాటి పదును ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహ్మద్ ఇచ్చిన డెమో ఓసారి చూద్దాం.
