
మద్యం షాపులు మూసి ఉంటే ఎలా ఉంటుంది.. మద్యం ప్రియులకు ఇది పెద్ద సమస్యే. ఒక్క రోజ మద్యం షాపులు మూసివేస్తున్నారంటే చాలు ముందుగానే మద్యం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారిక నోటీసు ప్రకారం.. 2025 ఏప్రిల్ 16న గుడ్ ఫ్రైడే సెలవుదినం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. ఎక్సైజ్ శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాలు గుడ్ ఫ్రైడే , ఏప్రిల్ చివరిలో బుద్ధ పూర్ణిమ, ఈద్-ఉల్-జుహా పండుగలకు మూసి ఉండనున్నాయి.
రాష్ట్రంలోని మద్యం లైసెన్స్ హోల్డర్లకు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010లోని రూల్ 52లోని నిబంధనల ప్రకారం.. డ్రై డేలను ప్రకటిస్తారు. డ్రై డేల సమయంలో లైసెన్స్ షాపులున్నప్పటికీ ప్రముఖ ప్రదేశాలకు మద్యం అమ్మడం లేదా అందించడంపై నిషేధం వర్తిస్తుందని ఆర్డర్ సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: తత్కాల్ టికెట్ల సమయ వేళలు ఏంటి? రద్దు ఛార్జీల వివరాలు!
ఏప్రిల్లో డ్రైడే రోజులు:
1. ఏప్రిల్ 6, ఆదివారం: రామ నవమి సందర్భంగా మద్యం షాపులు మూసి ఉన్నాయి.
2. ఏప్రిల్ 10, గురువారం: మహావీర్ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసి ఉన్నాయి.
3. ఏప్రిల్ 18, శుక్రవారం, గుడ్ ఫ్రైడే సందర్భంగా మద్యం షాపులు బంద్
మే నెలలో..
4. మే 12, సోమవారం: బుద్ధ పూర్ణిమ నాడు మద్యం షాపులు మూసివేత
జూన్ నెలలో..
5. జూన్ 6, శుక్రవారం: ఈద్-ఉల్-జుహా సందర్భంగా..
ఢిల్లీ ప్రభుత్వ మద్యం ఆదాయం:
కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ రాష్ట్రం మద్యం అమ్మకాల నుండి రూ. 5,000 కోట్లకు పైగా పన్నులు వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మద్యం అమ్మకాల ద్వారా రూ.5,164 కోట్ల పన్నులు సంపాదించిందని ఢిల్లీలోని కొత్త BJP ప్రభుత్వం పార్లమెంటు అసెంబ్లీకి తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల మద్యం విక్రయించింది. వార్తల నివేదిక ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 21.27 కోట్ల లీటర్ల మద్యం విక్రయించింది. అంటే రోజుకు 5.82 లక్షల లీటర్ల వరకు మద్యం అమ్ముడైంది.
ఇది కూడా చదవండి: RBI: దేశంలో నంబర్ వన్ బ్యాంకు ఏది? టాప్ 10 జాబితాను విడుదల చేసిన ఆర్బీఐ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి