
ప్రతి మనిషికి రెండు చేతులు ఉంటాయి. వాటిలో ఒకటి ప్రాథమికమైనదైతే మరొకటి ద్వితీయమైనది. దీని అర్థం మనుషులు ఎల్లప్పుడూ ఒక చేత్తోనే ఎక్కువ పని చేస్తాడు. ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ప్రధానంగా కుడిచేతి వాటం కలిగి ఉంటారు. వీరు తమ ఎడమ చేతిని తక్కువగా ఉపయోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే తమ ఎడమ చేతివాటం వారు ఉన్నారు. 90 శాతం మంది కుడి చేతినే ఉపయోగిస్తారు. దీనికి తోడు, ఇటీవల ఎడమచేతి వాటం వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఎడమచేతి వాటం ఉన్నవారికి కుడి చేతి వాటంవారితో పోల్చితే వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది.
జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఎడమచేతి వాటం ఉన్నవారికి ఇతరులతో పోలిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువట. దీనికి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కానీ దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణం అంటే జన్యుపరమైన సమస్య వల్ల కూడా జరుగుతుంది. మెదడు అనుసంధానం, పర్యావరణ కారకాల వల్ల కూడా జరగవచ్చు. ఎడమచేతి వాటం వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ
కుడిచేతి వాటం ఉన్న మహిళల కంటే ఎడమచేతి వాటం ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ విడుదల పెరగడం వల్ల ఎడమచేతి వాటం ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
స్కిజోఫ్రెనియా అనే మానసిక అనారోగ్యం
ఎడమచేతి వాటం ఉన్నవారు స్కిజోఫ్రెనియా అనే తీవ్రమైన మానసిక అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 2019, 2022, 2024 లో దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. వీటిల్లో స్కిజోఫ్రెనియా ఎడమచేతి వాటం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు తేలింది. భ్రమలు, అతి ఆలోచనలు, మిశ్రమ ప్రతిచర్యలు స్కిజోఫ్రెనియా ప్రధాన లక్షణాలు.
మానసిక సమస్యలు
ఎడమచేతి వాటం ఉన్నవారికి అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కుడిచేతి వాటం ఉన్నవారితో పోలిస్తే, వీరిలో మానసిక మార్పులు, ఆందోళన, భయం, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తం మీద ఎడమచేతి వాటం వ్యక్తులలో ఆందోళన ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
నాడీ సంబంధిత రుగ్మతలు
అదేవిధంగా అనేక ఇతర నాడీ సంబంధిత వ్యాధులు కూడా ఎడమచేతి వాటం వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆటిజం, డిస్ప్రాక్సియా కూడా ఉన్నాయి. ఎడమచేతి వాటం పిల్లలకు డిస్లెక్సియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఈ పరిశోధన రుజువైంది.
గుండె సంబంధిత వ్యాధులు
ఈ పరిశోధనలో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 379 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. వాటిపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ఎడమచేతి వాటం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు నిరూపించాయి. కుడిచేతి వాటం కంటే ఎడమచేతి వాటం ఉన్నవారి ఆయుస్షు కూడా తక్కువేనట. సగటున 9 సంవత్సరాల ముందే మరణిస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. అయితే ఈ వ్యాధులకు.. ఎడమచేతి వాటంకు మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధాన్నీ ఇప్పటి వరకు పరిశోధకులు కనుగొనలేదు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.