
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు ఆరాధ్య దేవతగా మారింది. ఈ అమ్మడు కోసం ఏకంగా గుడి కట్టేశారు అభిమానులు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 90’s లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది. స్టార్ హీరోహీరోయిన్లకు అమ్మ, అత్త పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. అప్పట్లో సీనియర్ హీరోలకు జోడిగా నటించిన ఖుష్బూ.. ఇప్పుడు యంగ్ స్టార్స్ కు తల్లిగా కనిపిస్తుంది. అలాగే రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఖుష్బూకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు అంటే అప్పట్లో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం ఖుష్బూ తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడిప్పుడే తమిళంలోనూ పలు సినిమాల్లో నటిస్తుంది. అలాగే నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖుష్బూ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఆమె భర్త తమిళంలో టాప్ డైరెక్టర్ సుందర్. ఇటీవలే అరణ్మనై 4 సినిమాతో హిట్ అందుకున్నారు. ఖుష్బూ సుందర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో అవంతిక పెద్దమ్మాయి.
అవంతిక విదేశాల్లో చదువుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. ఇక అందం, గ్లామర్ విషయంలో మాత్రం తల్లికి ఏమాత్రం తీసిపోదు. నిత్యం మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..