
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.
దీంతో కృతి శెట్టికి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాల తర్వాత కృతికి తెలుగులో ది బెస్ట్ అనిపించే సినిమా ఏదీ రాలేదు. ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
కొన్నాళ్లుగా తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న కృతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన లేటేస్ట్ స్టన్నింగ్ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఆమె మృదువైన, అందమైన లుక్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.
చాక్లెట్ బ్రౌన్ ఆఫ్ షోల్డర్ డిజైన్ డ్రెస్ లో మరింత ఆందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కృతి శెట్టి. యాంటిథెసిస్ ఇన్ డ్రెస్‌ను డిజైన్ చేసింది. ప్రణిత అభి స్టైలింగ్ నిర్వహించింది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో మాయ చేస్తోంది కృతి.
కృతి శెట్టి చివరగా ARM మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఆమె లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నటిస్తుంది. భారతీయ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్నా. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌తోపాటు ఎస్.జె. సూర్య కీలకపాత్రలో నటించారు. యోగి బాబు, గౌరీ జి. కిషన్, మిస్కిన్, సీమాన్, ఆనందరాజ్, సునీల్ రెడ్డి సహాయక పాత్రలు పోషించారు.