
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు 16.3 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా తలో 3 వికెట్లు తీశారు. రస్సెల్కు 2 వికెట్లు దక్కాయి. హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ 33 పరుగులు, కమిందు మెండిస్ 27 పరుగులు చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అంగ్క్రిష్ రఘువంశీ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 38 పరుగులు, రింకు సింగ్ అజేయంగా 32 పరుగులు చేశాడు. 5 మంది బౌలర్లు ఒక్కొక్కరికి ఒక వికెట్ పడగొట్టారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..