
ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో సన్రైజర్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది. వెంకటేష్ అయ్యర్ కేవలం 29 బంతుల్లో 60 పరుగులతో ఊచకోత కోశారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రఘువంశీ 50 పరుగులతో మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. షమీ, కమ్మిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండీస్ తలో వికెట్ పడగొట్టారు.
ఇరు జట్లు:
సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), కమిందు మెండిస్, సిమర్జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ
కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:
సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.
కోల్కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..