
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే, కోల్‌కతా వర్సెస్ బెంగళూరు మ్యాచ్ మొదలైంది. ఇందులో భాగంగా టాస్ జరగింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
అంతకుముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భాగంగా జరిగిన ఓపెనింగ్ వేడుకలో శ్రేయా ఘోషల్ మొదటి ప్రదర్శన ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ నటి దిశా పటాని డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ప్రదర్శన కొనసాగుతోంది. అరిజిత్ సింగ్, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ కూడా ప్రదర్శన ఇవ్వవచ్చు.
షారుఖ్ ఒక రోజు ముందే కోల్‌కతా చేరుకున్నాడు. అతను తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మద్దతు ఇచ్చేందుకు వచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఇరు జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(w), రజత్ పాటిదార్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(c), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.