
ఉదయం పూట వంట చేసేటప్పుడు చాలా హడావిడిగా చేయాల్సి ఉంటుంది. స్కూల్, ఆఫీస్‌లకు వెళ్లే వారు కంగారుగా వంట చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి కూరలో కారం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కంగారు పడకుండా.. ఇలా చేస్తే కారం తగ్గుతుంది.
కారం ఎక్కువైతే పిల్లలు అన్నం తినలేరు. కాబట్టి ఈ టైమ్‌లో ఈ చిట్కాలు ట్రై చేయండి. పెరుగు అందరి ఇళ్లలో ఉంటుంది. కాబట్టి పెరుగును కాస్త చిలికి కూరలో కలిపి.. ఓ రెండు నిమిషాలు కూరను వేడి చేస్తే సరిపోతుంది. కారం బ్యాలెన్స్ అవుతుంది.
అదే విధంగా కొబ్బరి పాలు ఉన్నా, కొబ్బరి పొడి ఉన్నా వేసి కలండి. వీటి వల్ల కూరలో కారం తగ్గడంతో పాటు రుచి కూడా మొత్తం మారిపోతుంది. దీంతో మంచి గ్రేవీ కూడా వస్తుంది.
బంగాదుంప ముక్కల్ని కోసి కూరలో వేసి ఉడికించండి. ఇలా చేయడం వల్ల కూడా కారం బ్యాలెన్స్ అవుతుంది. క్యాప్సికమ్, క్యారెట్స్, బఠానీలు కూడా కలపొచ్చు. కొద్దిగా నీళ్లు వేసి ఉడికిస్తే కారం తగ్గుతుంది.
కూరల్లో కారం తగ్గడానికి టమాటాలు కూడా చక్కగా పని చేస్తాయి. టమాటాలను ప్యూరీలా చేసి కూరలో కలిపి ఉడికించండి. ఇలా చేయడం వల్ల కారం తగ్గి, రుచి పెరుగుతుంది. నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.