
బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. కొన్ని రోజుల క్రితమే వారు ఈ శుభవార్త ను పంచుకున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. దీంతో ఆమె సినిమాల నుంచి విరామం తీసుకుంది. కాగా రొటీన్ చెకప్ లో భాగంగా కియారా అద్వానీ బుధవారం (ఏప్రిల్23) ఆస్పత్రికి వెళ్లింది. ఆమె వెంట భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నాడు. అయితే కియారా అద్వానీ ఆసుపత్రికి చేరుకోగానే ఆమె ఫోటోలు తీసుకోవడానికి ఫొటో గ్రాఫర్లు ఎగబడ్డారు. ఇది సిద్ధార్థ్ మల్హోత్రాకు కోపం తెప్పించింది. దీంతో అతను ఫొటోగ్రాఫర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సాధారణంగా సిద్ధార్థ్ మల్హోత్రా వీలైనంత వరకు కూల్ గా ఉంటాడు. ఈ హీరోకు కోపం రావడం చాలా అరుదు. కానీ ఇప్పుడు అతను గర్భంతో ఉన్న భార్య సేఫ్టీ గురించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కియారా అద్వానీ రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు కొందరు ఫొటో గ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. కియారా అసౌకర్యం చూసి సిద్ధార్థ్ మల్హోత్రా కోపోద్రిక్తుడయ్యాడు. ‘మీరందరూ వెనక్కి వెళ్లిపోండి’ అంటూ ఫొటోగ్రాఫర్లపై విరుచుకు పడ్డాడు.
ఈ వీడియో ఇప్పుు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘సిద్ధార్థ్ చేసింది సరైనదే.’ మంచి భర్తగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ జంటకు గోప్యత ఇవ్వండి. ఫొటో గ్రాఫర్లు సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ‘ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో..
Sidharth Malhotra firmly tells the paps : “Get back, get back… behave yourself.”😡😡 #sidharthmalhotra #bollywood #trending #reels #viral pic.twitter.com/42SABzV2RR
— Manas Bollywood (@Manasbollywood) April 23, 2025
నాకు కోపం తెప్పియద్దు.. సిద్ధార్థ్ ఆగ్రహం..
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు చిత్ర పరిశ్రమలో అధిక డిమాండ్ ఉంది. సిద్ధార్థ్ ప్రస్తుతం ‘పరమ సుందరి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా, కియారా అద్వానీ చేతిలో ‘టాక్సిక్’, ‘వార్ 2’ వంటి సినిమాలు ఉన్నాయి. గర్భం దాల్చడం వల్ల ఆమె సినిమా పనులకు దూరంగా ఉంది.
Sidharth Malhotra loses his cool on the paparazzi #sidharthmalhotra pic.twitter.com/yYzreBCSJs
— Manas Bollywood (@Manasbollywood) April 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.