కొన్ని రోజుల క్రితం హీరోయిన్ కత్రినా కైఫ్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన అత్తగారితో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే కత్రీనా తన కుటుంబసభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తుండగా.. అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఆమె అనుమతి లేకుండా కత్రినా అభ్యంతరకరమైన వీడియోను రికార్డ్ చేస్తు కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్స్, స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వీడియో పై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ సీరియస్ అయ్యింది. ఇది చాలా అసహ్యంగా ఉందంటూ విమర్శలు గుప్పించింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, ఇద్దరు వ్యక్తులు తమను తాము రికార్డ్ చేసుకుంటూ.. పక్కనే ఉన్న కత్రినా కైఫ్ వైపు తిప్పారు. ‘ఇది నేను, ఇది నా తమ్ముడు.. ఇది కత్రీనా కైఫ్ ‘ అంటూ ఆమెను చూపించారు. ఆ సమయంలో చుట్టుపక్కన ఉన్నవాళ్లు నవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ఈ వీడియో పై నెటిజన్స్ మండిపడ్డారు. మహాకుంభమేళా వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ వీడియోపై రవీనా టాండన్ కూడా స్పందించింది. “ఇది చాలా అసహ్యకరమైనది. ఇలాంటి వ్యక్తులు ప్రశాంతమైన వాతావరణాన్ని నాశనం చేస్తారు. ఇది చాలా విధాలుగా అగౌరవంగా ఉండటం చాలా దురదృష్టకరం” అన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించే ముందు, కత్రినా, ఆమె అత్తగారు అక్కడి సాధువులను దర్శనం చేసుకున్నారు. విక్కీ కౌశల్ కుటుంబంతో కలిసి కత్రినా తరచుగా మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన అత్తగారితో కలిసి సాయి బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లిన సంగతి తెలిసిందే. ‘ఛావా’ సినిమా విడుదలకు ముందు, విక్కీ సంగమంలో పవిత్ర స్నానం చేసాడు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..
