
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై ఆగ్రహం పెల్లుబికింది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఎలాగైనా మట్టుబెట్టాలని కోరుకుంటున్నారు దేశప్రజలు. మరోవైపు కేంద్రం సైతం ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్ కు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే దేశంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. అటు పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ కావడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తమవుతుంది.
అసలు విషయానికి వస్తే.. కరీనా కపూర్ ఇటీవల ఒక కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఆమె ప్రముఖ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మన్నన్‌ను కలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. అందులో కరీనా తెల్లటి కార్సెట్ డ్రెస్, ఫరాజ్ నల్లటి టీషర్ట్ ధరించి కనిపించాడు. అయితే ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ కావడంతో కరీనా పై సీరియస్ అవుతున్నారు నెటిజన్స్. ఆమెను పాకిస్తాన్ పంపించండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు రియాక్ట్ అవుతూ వాళ్లను బహిష్కరించాలి.. కరీనా ఇలా చేయడం సిగ్గుచేటు.. బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఇప్పటికే పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమాను భారత్ లో విడుదల చేయకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే సర్దార్ జీ3 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హనియా ఆమిర్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తొలగించారు. ఇప్పుడు కరీనా పాకిస్తానీ డిజైనర్‌తో పోజులివ్వడం చూసి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
While India is at war with Pakistan, Kareena Kapoor Khan is busy doing a photoshoot in Dubai with Pakistani designer Faraz Manan. She has collaborated with him multiple times in the past as well.
Last year, Kareena voiced her support for Palestine, but now she seems unable to… pic.twitter.com/2EsoDHEpvU
— STAR Boy TARUN (@Starboy2079) April 28, 2025
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‌మెన్‌గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..