మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అత్యధిక బడ్జె్ట్తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులతోపాటు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి మరో టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈసారి విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ పార్ట్ చూపించారు. అలాగే సినిమాలోని కీలక పాత్రలను రివీల్ చేశారు.
ఈ టీజర్ లో శివుడిగా అక్షయ్ కుమార్ పాత్రను, అలాగే పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ పాత్రతో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్ సహా పలువురి పాత్రలను చూపించారు. ఇక చివరిలో ప్రభాస్ లుక్ ను కూడా చూపించారు. ఈ టీజర్ లో ప్రభాస్ ఎంట్రీ హైలెట్ అనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
