
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా.. తారక్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోపాటు.. త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇదెలా ఉంటే.. ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న ఎన్టీఆర్.. ఒకప్పుడు డిజాస్టర్లతో సతమతమయ్యాడు. శక్తి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస వంటి బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అందుకున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో వచ్చిన సినిమా టెంపర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 35 కోట్లతో రూపొందించిన టెంపర్ మూవీ అప్పట్లోనే రూ.75 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో తారక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
టెంపర్ సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్ భాషలలో రీమేక్ చేశారు. హిందీలో ఈ చిత్రం ఏకంగా నాలుగు వందలకు పైగా వసూల్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ తో కాకుండా రవితేజతో చేయాల్సిందట. టైటిల్, డైరెక్టర్ ఫిక్సడైనా ఆ తర్వాత అనుకోకుండా ఈ చిత్రం తారక్ దగ్గరకు వచ్చింది. 2014లోనే రవితేజతో ఈ సినిమా చేయాలని మెహర్ రమేశ్ ప్లాన్ చేశారు. ఆ టైంలోనే వక్కంతం వంశీ చెప్పిన టెంపర్ కథ నచ్చడంతో అదే స్క్రిప్ట్ ను తమ సినిమా కోసం లాక్ చేశారు. ఈ సినిమాకు పవర్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. కొన్నాళ్లకే ఈ మూవీ కూడా ఆగిపోయింది. రవితేజ, మెహర్ రమేశ్ కాంబో వర్కవుట్ కాలేదు. దీంతో బాబీ, రవితేజ కాంబోలో వచ్చిన సినిమాకు పవర్ టైటిల్.. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు టెంపర్ టైటిల్ వాడారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..