
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలు దాడిని షురూ చేశాయి. పార్లమెంటు ప్రాంగణంలో రాష్ట్రపతి ప్రసంగంపై గాంధీ కుటుంబం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం గురించి కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము చాలా అలసిపోయిందని.. పూర్ లేడీ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ ప్రసంగం “బోరింగ్” అని వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే.. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం గాంధీ కుటుంబ సభ్యులు పార్లమెంట్ వెలుపలకు వచ్చారు. ఆ సమయంలో.. మీడియా వాళ్లు వారి స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సోనియా తొలుత ప్రెసిడెంట్ ప్రసంగాన్ని ఫాల్స్ ప్రామిస్ అని అభివర్ణించారు. అప్పుడు పక్కనే ఉన్న రాహుల్ బోరింగ్ అని వ్యాఖ్యానించారు. ఆపై సోనియా గాంధీ బదులిస్తూ, “చివరికి రాష్ట్రపతి చాలా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది. పూర్ థింగ్’ అని అన్నారు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు, కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు.
#WATCH दिल्ली: संसद में राष्ट्रपति के अभिभाषण के बाद कांग्रेस सांसद सोनिया गांधी ने कहा, “…अंत तक राष्ट्रपति बहुत थक गई थी…वे मुश्किल से बोल पा रही थीं…” pic.twitter.com/xT8AB1q6zD
— ANI_HindiNews (@AHindinews) January 31, 2025
రాష్ట్రపతిపై ఈ కామెంట్స్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్య దేశంలోని మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిని అవమానించడమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ నీచ రాజకీయ స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని బీజేపీ సీనియర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా చేసిన కామెంట్స్‌ను తనతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి పదాలను ఉద్దేశపూర్వకంగా వాడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ పేద, గిరిజన వ్యతిరేక వైఖరి స్పష్టమైందన్నారు. గౌరవనీయులైన రాష్ట్రపతికి, భారతదేశంలోని గిరిజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జేపీ నడ్డా డిమాండ్ చేశారు.
I and every @BJP4India Karyakarta STRONGLY CONDEMNS the usage of the phrase “poor thing” by Smt. Sonia Gandhi for Honourable President of India, Droupadi Murmu Ji. The deliberate usage of such words shows the elitist, anti-poor and anti-tribal nature of the Congress Party. I…
— Jagat Prakash Nadda (@JPNadda) January 31, 2025