
హైదరాబాద్, ఏప్రిల్ 18: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు బీఈ/బీటెక్ పేపర్ 1 పరీక్ష ఫైనల్ ‘కీ’ని అధికారిక వెబ్సైట్లో పొందుపరచింది. జేఈఈ మెయిన్-2025 సెషన్-2 పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఎన్టీఏ నిర్వహించిన సంగతి తెలిసిందే. గత జనవరిలో మొదటి సెషన్ నిర్వహించగా.. ఏప్రిల్‌లో రెండో సెషన్ పరీక్షలు జరిగాయి. రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు.
జేఈఈ మెయిన్-2025 సెషన్ 2 ఫైనల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే జేఈఈ-మెయిన్ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండడంపై ఇటీవల స్పందించిన ఎన్టీఏ తుది ‘కీ’ వచ్చేవరకు విద్యార్థులు వేచి చూడాలని సూచించింది. తుది ‘కీ’ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుందని, ప్రాథమిక ’కీ‘ల ఆధారంగా విద్యార్థులు ఓ నిర్ణయానికి రాకూడదని స్పష్టం చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 17న జేఈఈ ర్యాంకులు ప్రకటించవల్సి ఉంది. కానీ అర్ధరాత్రి దాటినా వెలువడని ఫలితాలు వెడువడకపోవడంతో విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది.
ఇవి కూడా చదవండి
గురువారం రోజంతా జేఈఈ మెయిన్ సెషన్–2 ఫలితాల కోసం అభ్యర్ధులు పడిగాపులు కాశారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినా.. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. గురువారం సాయంత్రం తుది ఆన్సర్ కీ విడుదల చేసినట్టే చేసి, కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితాల విడుదల, ఆన్సర్ కీలపై అప్డేట్ లేకుండా విద్యార్థులను గందరగోళానికి గురిచేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పటికి ఫలితాలు వస్తాయో.. ర్యాంకులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక విద్యార్ధులు గందరగోళ పడుతున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.