
ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్, భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య అయిన సంజనా గణేషన్, తమ కుమారుడు అంగద్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించింది. ముంబైలోని వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్ (MI) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అంగద్ కంటికి కనిపించిన తర్వాత ఈ వివాదం మొదలైంది. సంజనా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బలమైన సందేశం ఇచ్చింది. “మా కుమారుడు మీ జోక్స్‌కు లేదా వినోదానికి కాదు” అంటూ ఆమె స్పష్టం చేసింది. అంగద్ గురించి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించమని, తమ అభిప్రాయాలను తమ దగ్గరే ఉంచుకోవాలని ఆమె కోరింది.
ఆ రోజు సంజనా, అంగద్ కలిసి బుమ్రాకు మద్దతు ఇవ్వడానికి స్టేడియానికి వెళ్లారు. బుమ్రా నాలుగు వికెట్లు తీసి ముంబైకు గొప్ప విజయం సాధించిపెట్టగా, అదే సమయంలో చిన్న అంగద్ కూడా కెమెరాలోకి వచ్చి సోషల్ మీడియాలో చర్చకు దారితీసాడు. దీంతో సంజనా గణేషన్ ట్రోల్స్‌పై గట్టి సమాధానం ఇచ్చారు. కొంతమంది సోషల్ మీడియాలో అంగద్‌ను లక్ష్యంగా చేసుకుని అనవసరమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు, ఇది సంజనాను బాధించింది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది:
“మా కుమారుడు మీ వినోదానికి అంశం కాదు. జస్ప్రీత్ మరియు నేను అంగద్‌ను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేందుకు ఎంతటి శ్రమ పడుతున్నామో మీరు ఊహించలేరు. మేము కేవలం బుమ్రాకు మద్దతు ఇవ్వడానికి స్టేడియానికి వెళ్లాం. దయచేసి మా కుమారుడిపై అనవసరమైన వ్యాఖ్యలు చేయకండి.”
“ఒక బిడ్డ గురించి ‘ట్రామా’ లేదా ‘డిప్రెషన్’ వంటి పదాలను నిర్లక్ష్యంగా వాడటం మన సమాజ స్థితిని ఎంత దయనీయంగా చూపిస్తుందో ఆలోచించండి. మీరు మా కుమారుడి గురించి ఏమీ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు, మా జీవితాల గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. దయచేసి మీ అభిప్రాయాలను అక్కడే ఉంచుకోండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బుమ్రా రికార్డులు
జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేషన్ 2021లో పెళ్లి చేసుకున్నారు, 2025 మార్చిలో నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వారి కుమారుడు అంగద్ 2023 సెప్టెంబర్‌లో జన్మించాడు. ఆ తల్లి-కొడుకు జంట తరచూ బుమ్రా మ్యాచ్‌లలో మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది. క్రికెట్ పరంగా, గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రా మళ్లీ అప్రతిహతంగా సాగిపోతున్నాడు. లసిత్ మలింగ రికార్డు (170 వికెట్లు) అధిగమించి ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
Instagram story by Sanjana Ganesan pic.twitter.com/FE3HcyOXFr
— detective domgesh (@pransh139) April 28, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..