
ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదివరకు విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే బాధ వర్ణణాతీతం అని.. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చింది. ఇక ఆ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ గురించి ప్రస్తావించింది. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని ఎప్పుడూ చులకనగా చూస్తే మరింత బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు కూడా పీరియడ్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయని తెలిపింది.
జాన్వీ మాట్లాడుతూ.. “నాకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. నా మాట తీరుని బట్టి నేను పీరియడ్స్ లో ఉన్నానని ఎదుటివారికి అర్థమవుతుంది.. నేను చిరాకుగానే మాట్లాడితే వెంటనే అడిగేస్తారు. కొన్నిసార్లు ఆ ప్రశ్నలు అడిగే విధానమే బాధను కలిగిస్తోంది. ఎందుకంటే కొందరు నెలసరి నొప్పి అనేది చాలా చిన్న విషయంగా పరిగణిస్తూ ఎగతాళిగా మాట్లాడతారు. ఈ నొప్పిని అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మనకు ప్రశాంతత కలిగేలా మాట్లాడతారు. వారి ప్రవర్తన సైతం మనతో బాగుంటుంది. విశ్రాంతి ఎక్కువగా తీసుకోమని సలహాలిస్తారు. పీరియడ్ పెయిన్ అనుభవించేవారికే ఆ బాధ ఎంటో తెలుస్తోంది. ఆ సమయంలో మేము పడే బాధను.. ఆ మానసిక స్థితిని అబ్బాయిలు ఒక్క నిమిషం కూడా భరించలేరు. ఒకవేళ పీరియడ్స్ పెయిన్ నొప్పి అబ్బాయిలకు వస్తే అణు యుద్ధాలే జరిగేవేమో” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
పీరియడ్ పెయిన్ గురించి జాన్వీ ధైర్యంగా బహిరంగంగా మాట్లాడడంపై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం సమంత సైతం పీరియడ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు హీరోయిన్స్ బహిరంగంగా తమ అనుభవాన్ని వెల్లడిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..