
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అటు హీరోగా రాణిస్తూనే ఇటు దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు ధనుష్. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్. తెలుగులో జాబిలమ్మా నీకు అంత కోపమా పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ధనుష్ మేనల్లుడు పవీశ్ నారాయణన్ హీరోగా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది.
ధనుష్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. నీక్ చిత్రం మార్చి 21నే అందుబాటులోకి రాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ అడియన్స్ ముందుకు వచ్చేసింది. నిజానికి పది రోజుల ముందుగానే తమిళం వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు రాకపోవడంతో అసలు జాబిలమ్మా నీకు అంత కోపమా తెలుగులో ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు తెలుగు వెర్షన్ సైతం స్ట్రీమింగ్ అవుతుంది.
లవ్ బ్రేకప్ చుట్టూ సాగే రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని ధనుష్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ.15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.16 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇందులో పవీశ్ సరసన అనిక సురేంద్రన్ కథానాయికగా నటించగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, శరత్ కుమార్, మాథ్యూ థామస్ కీలకపాత్రలు పోషించారు.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..