
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గోవా అందాలను అనుభవించే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. స్వేచ్ఛాయుత జీవనశైలి, అపరిమిత ప్రకృతి అందాలు, ప్రశాంతమైన బీచ్‌లు గోవాను విశేషంగా నిలబెడతాయి. దేశీయ, విదేశీ పర్యాటకులు గోవాకు భారీగా వస్తుంటారు. కొల్వా కండోలిమ్ (Colva Candolim), మిరమార్ (Miramar), అంజునా (Anjuna), వర్కా (Varca) బీచ్‌లు గోవాలో ప్రధాన ఆకర్షణలు. అరేబియా సముద్రం పరిసర ప్రాంతాలను పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చింది. గోవాలో నడుస్తూ వెళ్లడం సైతం మైండ్‌ను రిఫ్రెష్ చేసే అనుభూతిని కలిగిస్తుంది.
హైదరాబాద్ నుంచి గోవా వరకు, తిరిగి హైదరాబాద్ వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. నాణ్యమైన హోటల్ గదుల్లో వసతి కల్పించబడుతుంది. రోజువారీ భోజన ఏర్పాట్లు ఉంటాయి. ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక గైడ్ అందించబడుతుంది. అలాగే ప్రయాణ సమయంలో అనుకోని పరిస్థితులకు బీమా సదుపాయం కూడా ఉంటుంది.
ప్యాకేజ్ వివరాలు
- ప్రారంభ ధర: రూ.19,625
- ప్యాకేజ్ పేరు: గోవా డిలైట్
- ప్రయాణ విధానం: విమానం
- స్టేషన్: RGI ఎయిర్పోర్ట్, హైదరాబాద్
- క్లాస్: కంఫర్ట్
- టూర్ తేదీలు: 20.03.2025
విమాన వివరాలు (HYD – GOI)
- విమాన సంఖ్య: 6E 362
- నగరం: హైదరాబాద్ (HYD)
- సమయం: 11:20 AM
- గమ్యం: గోవా (GOI)
- సమయం: 12:30 PM
విమాన వివరాలు (GOI – HYD)
- విమాన సంఖ్య: 6E 712
- నగరం: గోవా (GOI)
- సమయం: 2:25 PM
- గమ్యం: హైదరాబాద్ (HYD)
- సమయం: 3:40 PM
గమనిక: విమాన సమయాల్లో మార్పులు రావొచ్చు. ఎయిర్‌లైన్ షెడ్యూల్ ఆధారంగా అవి మారుతాయి.
కంఫర్ట్ క్లాస్: వ్యక్తికి అయ్యే ఖర్చు
- సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.24,485
- డబుల్ ఆక్యుపెన్సీ: రూ.20,000
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.19,625
- బెడ్ ఉన్న పిల్లలు (5-11 ఏళ్లు): రూ.15,885
- బెడ్ లేకుండా పిల్లలు (5-11 ఏళ్లు): రూ.15,510
- చిన్న పిల్లలు (0-4 ఏళ్లు): రూ.8,450
గమనిక: 0-2 ఏళ్ల పిల్లల ఛార్జీ బుకింగ్ సమయంలో IRCTC ఆఫీస్‌లో నగదుగా చెల్లించాలి.
గోవా ట్రిప్ ఎందుకు ప్రత్యేకం..?
గోవా బీచ్‌లు మాత్రమే కాదు.. నైట్‌లైఫ్, చారిత్రక ప్రదేశాలు, స్థానికంగా ప్రసిద్ధిగాంచిన గోవన్ ఫుడ్ అనుభవించేందుకు ఇది అద్భుతమైన అవకాశం. విహార యాత్రలకు, హనీమూన్ కోసం గోవా బెస్ట్ డెస్టినేషన్. మిత్రులు, కుటుంబ సభ్యులతో మధురమైన అనుభూతులు పొందేందుకు గోవా పర్యటన మీకు సరైన ఎంపిక.