
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భాగ్యనగర వాసులు కోసం సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ద్వారా కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో పలు దేవాలయాలను దర్శించడంతో పాటు బీచ్‌లో ఎంజాయ్ చేయవచ్చు, ఏప్రిల్ 29వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఈ టూర్ ప్యాకేజీలో కర్ణాటకలోని తీర ప్రాంతాలైన మురుడేశ్వర్, శృంగేరి, ఉడిపి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. ఐఆర్సీటీసీ టూరిజం కోస్టల్ కర్ణాటక పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రతి మంగళవారం కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి మొదలయ్యే ఈ టూర్ ప్యాకేజీ ధర ఎంత? ఏ ఏ ప్రదేశాలను సందర్శించవచ్చు తెలుసుకుందాం..
కోస్టల్ కర్ణాటక టూర్ మొత్తం ఆరు రోజులు సాగుతుంది.
మొదటి రోజు: కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(నెంబర్ 12789) ట్రైన్ ఉదయం 6.05 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. దీంతో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. మొదటి రోజు రాత్రి మొత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
రెండో రోజు: ఉదయం 10 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఉడిపికి వెళ్లి అక్కడ హోటల్లో చెకిన్ అవుతారు. ఫ్రెష్ అయి.. ఉడిపిలోని శ్రీ పాండు రంగ ఆలయంకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వత మాల్పె బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మూడో రోజు: ఉదయం ఉడిపి నుంచి కొల్లూరు మూకాంబిక ఆలయం దర్శనానికి వెళ్తారు. అక్కడ నుంచి మురుడేశ్వర్ కి చేరుకుంటారు. శివాలయాన్ని.. భారీ శివుడి విగ్రహాన్ని దర్శించుకోవాలి. సాయంత్రానికి గోకర్ణకి చేరుకుంటారు. దేవాలయం చూసి తర్వాత బీచ్‌కి చేరుకుంటారు. రాత్రికి మళ్ళీ ఉడిపి కి చేరుకొని ఇక్కడే బస చేయాల్సి ఉంటుంది.
నాలుగో రోజు: ఉదయం ఉడిపి హోటల్ చెక్ అవుట్ చేసి హోర్నాడు చేరుకోవాలి. ఇక్కడ అన్నపూర్ణ దేవి ఆలయాని దర్శించుకుని అక్కడ నుంచి శృంగేరికి చేరుకుంటారు. ఇక్కడ శారదాంబ ఆలయం సందర్శించిన సాయంత్రానికి మంగళూరుకి చేరుకుంటారు. రాత్రి మంగలూరులోని హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.
ఐదో రోజు: మంగళూరులోని మంగళాదేవి, కద్రి మంజునాథ, కుండ్రోలి గోకర్నాథ ఆలయాలను దర్శించుకుని తన్నేర్బవి బీచ్‌లో ఎంజాయ్ చేయడంతో ఈ టూర్ ముగుస్తుంది. ఇక్కడ నుంచి మంగళూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు కాచిగూడ కు తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి మొత్తం జర్నీ చేస్తారు
ఆరో రోజు: రాత్రి 11.40కి ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది. దీంతో కోస్టల్ కర్ణాటక టూర్ ముగుస్తుంది .
టూర్ ప్యాకేజీలో టికెట్ ధరలు
కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్- రూ.39,140
డబుల్ షేరింగ్- రూ.22,710
ట్రిపుల్ షేరింగ్- రూ.18,180
5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్- రూ.11,610
5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ అవుట్ బెడ్- రూ.10,210
స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు -రూ.36,120,
డబుల్ షేరింగ్- రూ.19,690,
ట్రిపుల్ షేరింగ్ -రూ.15,150గా
5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్- రూ.8,590,
5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ అవుట్ బెడ్- రూ.7,190
ప్యాకేజీలో ప్రయాణీకులకు కల్పించేసౌకర్యాలు
స్టాండర్డ్ అండ్ కంఫర్ట్ జోన్ లో ట్రైన్ టికెట్లు
ట్రావెలింగ్ ప్యాకేజీ ఎంపిక ఆధారంగా టూర్ లో ప్రయాణించేందుకు ఏసీ వెహికల్
హోటల్ అకామిడేషన్
మూడు రోజులు అల్పాహారం
ప్రయాణ భీమా సౌకర్యం
వేసవి సెలవుల సందర్భంగా IRCTC తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ మే 6, 13, 20 , 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా.. ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..