
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ఓ లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తూ.. పంజాబ్ కింగ్స్ కేవలం 111 టార్గెట్‌ను కాపాడుకుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తొలుత ప్రత్యర్థిని 111 పరుగులకే కట్టడి చేసి.. ఆ చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్లో అతి చిన్న టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న టీమ్‌గా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. అది కూడా కేకేఆర్ పైనే నమోదు చేసింది.
గతేడాది ఐపీఎల్లో ఈ రికార్డు సాధించింది పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకు హైస్కోరింగ్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసిన క్రికెట్ అభిమానులు.. మంగళవారం రాత్రి లో స్కోరింగ్ థ్రిల్లర్‌కు ఫిదా అయిపోయారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మజా ఇచ్చింది. అయితే.. ఇలాంటి మ్యాచ్‌లు ఐపీఎల్లో అవసరం లేదంటూ పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. 50 ఏళ్ల వయసులో ఇంత టెన్షన్ తాను తట్టుకోలేనని అందుకే ఇలాంటి థ్రిల్లర్లు వద్దంటూ పాంటింగ్ సరదాగా పేర్కొన్నాడు.
నిజమే.. పాంటింగ్‌తో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఒంటికాలిపై నిలబడి, సీట్ ఎడ్జ్‌కు కూర్చోని, కనురెప్ప వేయకుండా చూశారు.. చివరి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా ట్విస్టులతో సాగింది. 75 శాతం మ్యాచ్ ముగిసే వరకు అసలు పోటీలో లేని పంజాబ్ కింగ్స్.. యుజ్వేంద్ర చాహల్ విజృంభనతో మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది. ఏది ఏమైనా.. మ్యాచ్ మాత్రం క్రికెట్ అభిమానులు ఫుల్ మజాను ఇచ్చింది.
Ricky Ponting said ~ “I do not need these kinds of matches in the IPL at the age of 50”.#PBKSvsKKR pic.twitter.com/2JA7kOMYF5
— Richard Kettleborough (@RichKettle07) April 16, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..