
ఐపీఎల్ 2025లో 25వ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. సీఎస్కే కెప్టెన్‌గా మళ్లీ ధోని బాధ్యతలు చేపట్టాడు. ధోని రాకతోనైనా.. సీఎస్కే విజయాల బాటపడుతుందో లేదో చూడాలి. అయితే.. ఈ 25వ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ ఏ టీమ్ ఏ స్థానంలో ఎంత నెట్ రన్ రేట్‌తో ఉందో చూద్దాం..
తొలి రెండు స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. గుజరాత్ 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లు, +1.413 రన్‌రేట్‌తో ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓడిపోలేదు. నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లు +1.278 నెట్ రన్‌రేట్‌తో రెండో ప్లేస్‌లో ఉంది.
ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు +0.539 రన్‌రేట్‌తో ఉంది. పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు +0.289 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.
5, 6, 7 స్థానాల్లో వరుసగా.. లక్నో్ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ఉన్నా్యి. ఎల్ఎస్జీ 5లో 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు +0.078 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్ 5లో రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో -0.056 రన్ రేట్‌తో ఆరో ప్లేస్‌లో ఉంది. ఆర్ఆర్ 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 4 పాయింట్లు -0.733 రన్‌రేట్‌తో 7వ స్థానంలో ఉంది.
అలాగే 8, 9, 10 స్థానాల్లో వరుసగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. ఈ మూడు టీమ్స్ సైతం 5 మ్యాచ్‌లు ఆడి ఒక్కటి మాత్రమే గెలిచి నాలుగేసి మ్యాచ్‌లు ఓడిపోయి.. 2 పాయింట్లతో ఉన్నాయి. కానీ, ఎంఐ -0.010, సీఎస్కే -0.889, ఎస్ఆర్హెచ్ -1.629 రన్‌రేట్‌తో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.