
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతుండటంతో, ఎవరి వ్యూహం నెగ్గుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టోర్నమెంట్లో తొలి మ్యాచ్ ఆడుతున్నందున RCB ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించింది. జట్టులోని కొంతమంది ఆటగాళ్ళు నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. కానీ ఆర్సీబీకి ఫేస్ లాంటి విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా టీమ్‌తో జత కట్టలేదు. కోహ్లీ త్వరలోనే జట్టులో చేరనున్నాడు.
నిజానికి, ప్రతి ప్రధాన ఈవెంట్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ తన హెయిర్ స్టైల్ మారుస్తాడు. కోహ్లీ చాలా సంవత్సరాలుగా ఈ ధోరణిని కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ తన హెయిర్ స్టైల్ మార్చుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ తన హెయిర్ స్టైల్ ను మార్చుకున్నాడు. ఆ సమయంలో, కోహ్లీకి ప్రఖ్యాత ఆస్ట్రేలియా సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జోర్డాన్ టబాక్మాన్ కొత్త లుక్ ఇచ్చారు. ఇప్పుడు, భారతదేశపు ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ కోహ్లీకి కొత్త లుక్ ఇచ్చాడు.
ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండాగే, జాకబ్ బెథెల్, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లుంగి న్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి.