
SRH Captain Leave India After Loss to Mumbai Indians: ఐపీఎల్ 2025లో తన సీజన్‌ను తుఫాన్‌లా ప్రారంభించింది. ఆ తర్వాత వేగం తగ్గి డీలా పడిపోయింది. తాజాగా హైదరాబాద్ కూడా ముంబై ఇండియన్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఏడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఐదవ ఓటమి. ముంబై చేతిలో ఓటమి పాలైన తర్వాత, హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారతదేశం విడిచి వెళ్లడం గురించి చర్చలు జరుగుతున్నాయి. నిజానికి, కమ్మిన్స్ భారతదేశం విడిచి వెళ్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు కమ్మిన్స్ భార్య బెక్కి సోషల్ మీడియా పోస్ట్ కారణమైంది. శుక్రవారం నాడు బెక్కీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెండు ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత కమ్మిన్స్ భారతదేశం విడిచిపెడుతున్నారనే పుకార్లు వ్యాపించింది.
ఈ పుకారు దావానలంలా వ్యాపించడంతో.. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భార్య బెక్కీ విమానాశ్రయం నుంచి వచ్చిన కమ్మిన్స్ లగేజీతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో, కమిన్స్ చుట్టూ చాలా లగేజీ బ్యాగ్‌లు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కమ్మిన్స్ ఎప్పుడూ ఎక్కువగా ప్యాక్ చేస్తాడంటూ ఆయన భార్య బెక్కీ పేర్కొంది. రెండవ ఫొటోలో, బెక్కీ విమానాశ్రయం వెలుపల పాట్ కమ్మిన్స్‌తో కలిసి కనిపించింది. ఈ ఫొటోతో ఆయన గుడ్‌బై ఇండియా అంటూ రాసుకొచ్చింది. ‘భారతదేశానికి వీడ్కోలు, ఈ అందమైన దేశాన్ని సందర్శించడం మాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది.
బెక్కి పోస్ట్ తర్వాత, పాట్ కమ్మిన్స్ భారతదేశం విడిచి వెళ్తున్నారనే పుకార్లు కూడా వ్యాపించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లారిటీ ఇచ్చింది. కమ్మిన్స్ భారతదేశం విడిచిపెడుతున్నారనే వార్త కేవలం పుకారు మాత్రమే అని, అతను జట్టుతో చాలా సంతోషంగా ఉన్నాడని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
పాట్ కమ్మిన్స్ జట్టుతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను భారతదేశం ఎందుకు వదిలి వెళ్లాడు? అంటూ ఎస్ఆర్హెచ్ పేర్కొంది.
IPL 2025లో SRH ప్రదర్శన..
గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి తన ప్రచారాన్ని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. అయితే, దీని తర్వాత, ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత, హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి సీజన్లో తమ రెండో విజయాన్ని సాధించింది. తరువాతి మ్యాచ్‌లో ముంబై చేతిలో మళ్లీ ఓటమిని ఎదుర్కొంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..