
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. లక్నో ఇచ్చిన 172 పరుగుల టార్గెట్‌ను కేవలం 16.2 ఓవర్లలోనే ఊదిపారేసింది పంజాబ్. 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ నాలుగో సారి వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గింది. ఈ సీజన్ ఆరంభానికి ముందు జట్టును సమూలంగా మార్చేసి.. ఒక స్టార్ ఇండియన్ క్రికెటర్‌ను కెప్టెన్‌గా తెచ్చుకున్న పంజాబ్.. అందుకు తగ్గ ఫలితాలు అందుకుంటోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం.. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు ఓటములతో ఉంది.
తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన లక్నో, రెండో మ్యాచ్‌లో మాత్రం పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వాళ్ల సొంత గడ్డపై ఓడించి.. కమ్ బ్యాక్ ఇచ్చింది. కానీ, మళ్లీ మూడో మ్యాచ్‌లో పంజాబ్‌పై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. మ్యాచ్ ఓడిపోతే.. కెప్టెన్లను కడిగి పారేసే వ్యక్తిగా గోయంకాకు పేరుంది. మంగళవారం కూడా పంజాబ్‌పై ఓటమి తర్వాత పంత్‌కు చివాట్లు తప్పలేదు. తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై ఓడిన తర్వాత కూడా గోయంకా ఇలాగే పంత్‌తో కోపంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. నిన్న కూడా సేమ్ అలాంటి సీన్స్ రిపీట్ అయ్యాయి. గతంలో లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌పై ఆయన ఇలాగే అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వచ్చాయి.
సొంత కెప్టెన్ల విషయంలో ఇంత కఠినంగా ఉండే గోయంకా.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎక్కడలేని ప్రేమను చూపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వద్దకు వెళ్లి, అతన్ని హగ్ చేసుకొని చాలా సేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే అయ్యర్‌కు ఆయన ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్‌ను వదిలేసి.. లక్నో టీమ్‌లోకి రావాలని, కెప్టెన్సీ ఆఫర్‌తో పాటు భారీగా రెమ్యునరేషన్ ఇస్తానంటూ అయ్యర్‌కు గోయంకా ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. మరి నిజంగానే గోయంకా, అయ్యర్‌కు ఆ ఆఫర్ ఇచ్చారా? లేదా? అన్న విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ స్పష్టత రాదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.