అయితే, ఐపీఎల్ అరంగేట్రం ముషీర్ కెరీర్లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముషీర్, లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో అనూహ్య పరిస్థితుల్లో అతనికి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోవడంతో, ముషీర్ ‘ఇంపాక్ట్ సబ్’గా బరిలోకి దిగాడు.
