
IPL 2025 Points Table updated after SRH vs GT: పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్లో కూడా ఓటముల పరంపర కొనసాగుతోంది. గుజరాత్ పై హైదరాబాద్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. దీని కారణంగా హైదరాబాద్ జట్టు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. దీని కారణంగా హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో పదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, గుజరాత్ జట్టు నాల్గవ మ్యాచ్‌లో మూడవ విజయాన్ని నమోదు చేసింది. ఆరు పాయింట్లతో జట్టు మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకుంది.
హైదరాబాద్‌కు పొంచి ఉన్న ప్లే ఆఫ్స్ ప్రమాదం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పాలంటే, తొలి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోరు సాధించడం ద్వారా అద్బుత ఆరంభాన్ని ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ జట్టు 200 పరుగులు కూడా చేయలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు విజయం వైపు పయనించకపోతే, గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు త్వరలోనే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే ఛాన్స్ ఉంది.
IPL 2025 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?
1) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 3, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – 1.257)
2) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 3, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – 1.031)
3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 1.149)
4) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 0.074)
5) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 2, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -0.346)
6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 2, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.048)
7) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 2, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -0.185)
8) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 1, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2,నెట్ రన్ రేట్ – 0.108)
9) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 1, ఓటమి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.891)
10) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 1, ఓటమి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.629).
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..