
IPL 2025 Points Table updated after LSG vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 40వ మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, ఐడెన్ మార్క్రామ్ తుఫాను హాఫ్ సెంచరీతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక ఛేజింగ్‌లో అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ ఆధారంగా ఢిల్లీ 160 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో (IPL 2025 Points Table) భారీ ఆధిక్యాన్ని సాధించింది.
ప్లే ఆఫ్స్ దిశగా ఢిల్లీ అడుగులు..
అక్షర్ పటేల్ కెప్టెన్సీలో, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఐపీఎల్ 2025లో తమ 8వ మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ.. ఈ సీజన్లో ఆరో విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయంతో ఢిల్లీ ఇప్పుడు 12 పాయింట్లకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ రెండవ స్థానంలో ఉంది. ఎందుకంటే, గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. దీని నికర రన్ రేట్ ప్రస్తుతం ఢిల్లీ కంటే కొంచెం మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణం.
లక్నోకు ఇబ్బందులు తప్పవా..
ఈ టోర్నమెంట్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మిశ్రమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో పంత్ సేన ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో (IPL 2025 Points Table) 10 పాయింట్లతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. లక్నోకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే, ఆ జట్టు మిగిలిన మ్యాచ్‌లలో కనీసం 4 మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. అయితే, ఇది అంత సులభం కాదు. ఎందుకంటే, తదుపరి కొన్ని మ్యాచ్‌లు లక్నో వెలుపల జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్లేఆఫ్స్ కోసం పెరిగిన పోటీ..
ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో, ప్లేఆఫ్స్ కోసం రేసు గతంలో కంటే మరింత ఆసక్తికరంగా మారింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ జట్లు 12 పాయింట్లతో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి. అయితే నంబర్ 3, నంబర్ 4 స్థానాల కోసం పోరాటం ఇంకా కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉండగా, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా కూడా ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనే ఈ రెండు జట్ల కల దాదాపుగా ముగిసినట్లే.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..