
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారీ పోరుతో ప్రారంభంకానుంది. ఒక్క బంతి కూడా పడకముందే, కొత్త IPL సీజన్ గురించి క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. BCCI ఈ సీజన్‌కు ముందుగా కొత్త సూపర్ ఓవర్ నిబంధనలను విడుదల చేయడం గమనార్హం.
IPL 2025 ప్రారంభానికి ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీల కెప్టెన్ల సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో సూపర్ ఓవర్ గురించి కొన్ని కీలక మార్పులను చర్చించి, అధికారికంగా అమలు చేయాలని నిర్ణయించారు. క్రిక్‌బజ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పుడు IPL మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్లకు పరిమితి ఉండదు. విజేతను తేలే వరకు ఎన్ని సూపర్ ఓవర్లు అయినా కొనసాగుతాయి.
BCCI నమ్ముతున్న ప్రకారం, ఒక గంటలోపు టై బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త నియమాన్ని కెప్టెన్లతో మేక్ & గ్రీట్ సెషన్లో చర్చించినట్లు వెల్లడించారు.
BCCI విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూపర్ ఓవర్ వ్యవహారం మరింత క్లియర్‌గా చెప్పబడింది:
ఒక గంట పరిమితి – ప్రధాన మ్యాచ్ ముగిసిన ఒక గంటలోపు విజేత తేల్చాలి.
సూపర్ ఓవర్ల వ్యవధి:
మ్యాచ్ ముగిసిన 10 నిమిషాల్లోపు మొదటి సూపర్ ఓవర్ ప్రారంభం కావాలి. మొదటి సూపర్ ఓవర్ కూడా టై అయితే, 5 నిమిషాల్లోపు రెండో సూపర్ ఓవర్ ప్రారంభించాలి. ఇదే విధంగా, విజేత తేలే వరకు ప్రతి సూపర్ ఓవర్ మధ్య 5 నిమిషాల గడువు ఉంటుంది.
సూపర్ ఓవర్ ఫార్మాట్:
ప్రతి జట్టు ఒక్క ఓవర్ (6 బంతులు) మాత్రమే ఆడుతుంది. ఎన్ని వికెట్లు కోల్పోయినా, ఎక్కువ పరుగులు చేసిన జట్టే గెలుస్తుంది. ఒక జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే, వారి సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ వెంటనే ముగుస్తుంది.
వాతావరణ పరిస్థితులు & ఆలస్యం:
వర్షం, చెదిరిన వాతావరణం వంటివి ఉంటే మ్యాచ్ రిఫరీ నిర్ణయించిన సమయానికి సూపర్ ఓవర్ జరగాలి. అసలు మ్యాచ్ ముగిసిన 10 నిమిషాల తర్వాత సూపర్ ఓవర్ తప్పనిసరిగా మొదలవాలి. సూపర్ ఓవర్ ఆలస్యమైనా లేదా అంతరాయాలు వచ్చినా, అదనపు సమయం కేటాయించబడుతుంది.
పిచ్ & గ్రౌండ్ మార్పులు:
సాధారణంగా అదే పిచ్‌లో సూపర్ ఓవర్ జరగాలి. అంపైర్లు పిచ్ అనుకూలంగా లేదని భావిస్తే తప్ప, కొత్త పిచ్‌పై సూపర్ ఓవర్ జరపరు.
గత IPL సీజన్లలో కొన్ని మ్యాచ్‌లు టై అయిన తర్వాత సూపర్ ఓవర్ల పరిమితి ఉండడం, ప్రేక్షకుల్లో కొంత గందరగోళానికి దారి తీసింది. కొన్ని సందర్భాల్లో వాతావరణం, సమయ సమస్యల కారణంగా విజేతను నెట్ రన్‌రేట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, BCCI ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది.
ఇప్పుడు IPL 2025లో, విజేత తేలే వరకు సూపర్ ఓవర్లు జరుగుతాయి, దీని వల్ల మ్యాచ్‌ల ఉత్కంఠ మరింత పెరుగుతుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కెప్టెన్లు, కోచ్‌లు మరియు ఆటగాళ్లు ఈ మార్పులను స్వాగతించారు.
🚨 SUPER OVER RULES IN IPL. 🚨
– A maximum of one hour will be provided for Super Overs.
– Any number of Super Overs can be played, but within the 1 hour time frame. (Cricbuzz). pic.twitter.com/PiASMBJ8t4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..