
ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పేసర్ మహమ్మద్ షమీకి బ్లాక్ డేగా మారింది. ఈ మ్యాచ్‌లో షమీ తేలిపోయాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్స్ షమీ బౌలింగ్‌లో విధ్వంసం చేశారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డ్ నెలకొల్పాడు.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల ఊచకోతతో షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రెండవ చెత్త గణాంకాలను నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్ చేసిన మొత్తం 245 పరుగుల్లో షమీ తన 4 ఓవర్లలో 75 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ హైదరాబాద్‌పై 76 పరుగులు చేసి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు.
ఐపీఎల్లో చెత్త బౌలింగ్ గణాంకాలు..
బౌలర్ | ఇచ్చిన పరుగులు | ప్రత్యర్థి |
జోఫ్రా ఆర్చర్ | 76 | హైదరాబాద్ |
మహమ్మద్ షమీ | 75 | పంజాబ్ |
మోహిత్ శర్మ | 73 | ఢిల్లీ |
బాసిల్ తంపి | 70 | బెంగళూరు |
యష్ దయాళ్ | 69 | కోల్‌కతా |
టోర్నమెంట్ ప్రారంభంలో, జోఫ్రా ఆర్చర్ SRH పై 0/76 గణాంకాలతో చెత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇది IPL లో అత్యంత చెత్త గణాంకాలుగా మారిపోయింది. ఈ క్రమంలో షమీ వికెట్లు పడగొట్టకుండా 75 పరుగులు ఇచ్చి ఆ రికార్డును దాదాపుగా బద్దలు కొట్టాడు.
ఐపీఎల్లో చెత్త బౌలింగ్ గణాంకాల జాబితాలో మోహిత్ శర్మ , బాసిల్ తంపి, యష్ దయాల్ ఈ చెత్త రికార్డుల్లో మరో ముగ్గురు బౌలర్లు స్థానం సంపాదించుకున్నారు.
పంజాబ్ భారీ స్కోర్..
పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య జోడీ హైదరాబాద్ బౌలింగ్‌ను చిత్తు చేశారు. వీరిద్దరు ఔట్ అయిన తర్వాత జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ నిష్క్రమించిన తర్వాత, మార్కస్ స్టోయినిస్ బీభత్సం చేశాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్‌ను హై నోట్‌తో ముగించాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..