
IPL 2025లో ముంబై ఇండియన్స్ (MI) చివరికి విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసి సీజన్లో తమ మొదటి గెలుపును ఖాతాలో వేసుకుంది. అయితే ఈ విజయాన్ని మించేలా మరో విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అదే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ సీరియస్ డిస్కషన్! మ్యాచ్ తర్వాత స్టేడియంలో రోహిత్ శర్మ, నీతా అంబానీ కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే, ఆ సమయంలో నీతా అంబానీ కాస్త సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “ఏమైందయ్యా నీకు?” అన్నట్లుగా ఆమె రోహిత్ శర్మ ఫామ్ గురించి గంభీరంగా చర్చించినట్లుగా అనిపించింది.
IPL 2025 సీజన్లో రోహిత్ శర్మ పూర్తిగా లయ తప్పాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా, రోహిత్ బ్యాట్ నుండి కేవలం 21 పరుగులే వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్, గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన రెండో మ్యాచ్‌లో తక్కువ స్కోరు, కేకేఆర్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ అతని బ్యాటింగ్ విఫలమవ్వడంతో అతనిపై ఒత్తిడి మరింత పెరిగింది.
రోహిత్ గతంలో ముంబై ఇండియన్స్‌కు ఎన్నో విజయాలు అందించాడు, ఐదు టైటిళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ప్రస్తుతం ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీ కోల్పోవడం, ఆ తర్వాత కూడా తక్కువ పరుగులతో జట్టుకు లబ్ధి చేకూర్చలేకపోవడం, అభిమానుల్లో అసంతృప్తిని పెంచింది.
రోహిత్ శర్మ ఫామ్ గురించి చర్చించుకుంటున్నా, ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం తమ మూడో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. ముఖ్యంగా అశ్విని కుమార్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసి కోల్‌కతా బ్యాటింగ్ లైనప్‌ను తుడిచిపెట్టేశారు.
ఓవరాల్‌గా, కేకేఆర్ 45 పరుగుల వ్యవధిలోనే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఇది వారి ఓటమికి ప్రధాన కారణమైంది. ముంబై ఇండియన్స్ ఈ అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని, 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ తమ IPL 2025 సీజన్లో మొదటి పాయింట్లను సాధించింది. కానీ, రోహిత్ శర్మ ఫామ్‌పై ఉన్న అనుమానాలు ఇంకా తొలగలేదని చెప్పాలి. మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్, తదుపరి మ్యాచుల్లో మంచి ఇన్నింగ్స్ ఆడకపోతే, జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
Rohit Sharma and Nita Ambani having chat together after the match. 💙 pic.twitter.com/ZJdyhES2yh
— Tanuj (@ImTanujSingh) March 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..