
Anrich Nortje Bat Doesn’t Pass Umpires Test: ఐపీఎల్ (IPL) 2025లో, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన అన్రిక్ నార్కియా తన బ్యాట్‌ను మార్చవలసి వచ్చింది. అన్రిక్ నార్కియా బ్యాట్ వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల అంపైర్ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అతిన బ్యాట్ బీసీసీఐ రూల్స్‌కు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మైదానంలోని అంపైర్లు నార్కియాను బ్యాట్ మార్చమని కోరారు. ఈ సంఘటన కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ ప్రారంభంలో జరిగింది. తరువాత కోల్‌కతాకు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్ అన్రిక్ నార్కియాకు రెండవ బ్యాట్ అందించాడు.
బ్యాట్‌ను తనిఖీ చేసే విధానం గత వారం నుంచే IPL 2025లో ప్రారంభమైంది. ఇందులో భాంగా మొదటగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణాల బ్యాట్లను టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌ను మైదానంలో కొలిచారు. ఇటువంటి పరిస్థితిలో, నార్కియా పరీక్షలో బ్యాట్ విఫలమైన మొదటి బ్యాటర్‌గా తేలాడు. నార్కియా కొత్త బ్యాట్ వచ్చే వరకు ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వెంటనే, ఆండ్రీ రస్సెల్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న లక్ష్యాన్ని కాపాడుకుంది.
బ్యాట్‌కు సంబంధించిన నియమాలు ఏలా ఉన్నాయి?
గతంలో ఐపీఎల్లో, బ్యాట్ల మందం, వెడల్పును డ్రెస్సింగ్ రూమ్ లోపలే కొలిచేవారు. నిబంధనల ప్రకారం, బ్యాట్ వెడల్పు 10.79 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. బ్యాట్ మందం 6.7 సెం.మీ కంటే ఎక్కువ ఉండకూడదు. అంచు వెడల్పు 4 సెం.మీ కంటే ఎక్కువ ఉండకూడదు. బ్యాట్ పొడవు 96.4 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా నార్కియా తన తొలి మ్యాచ్ ఆడాడు. అతను చాలా కాలంగా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు, అతను మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు.
బ్యాట్ల తనిఖీలపై ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారు?
ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ బ్యాట్ల తనిఖీలపై మాట్లాడుతూ, ‘ఎవరో అనవసరంగా ప్రయోజనం పొందుతున్నారని ఎవరూ భావించకూడదు. ఆటలో సమానత్వాన్ని కాపాడుకోవడానికి బీసీసీఐ, ఐపీఎల్ ఎల్లప్పుడూ చర్యలు తీసుకుంటుంది. అన్ని నిర్ణయాలు సమీక్షించదగినవిగా ఉండేలా, ఆటపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేలా మేం సాంకేతికతను ఉపయోగించాం. ఈ ప్రచారం వెనుక ఉన్న ఆలోచన క్రీడా స్ఫూర్తిని సజీవంగా ఉంచడమే’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..