
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర దెబ్బ వల్ల గాయపడి ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అతని గైర్హాజరీతో మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. మహారాష్ట్ర బ్యాటర్ అయిన గైక్వాడ్ ఐపీఎల్ 2025లో కేవలం ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడి, 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అతని గైర్హాజరీతో CSK టాప్ ఆర్డర్ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది అందరిలో ఆసక్తిగా మారింది. అతని స్థానాన్ని తీసే అవకాశం ఉన్న ముగ్గురు ఆటగాళ్లు ఇవే:
పృథ్వీ షా
ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ అయిన పృథ్వీ షా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎవరు కొనకపోవడం వల్ల ఆటకి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో అతను 8 మ్యాచ్‌లలో 198 పరుగులే చేశాడు. 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 9 ఇన్నింగ్స్‌లో 197 పరుగులే చేయగలిగాడు.
అతని ఫిట్నెస్ విషయంలోనూ గతంలో విమర్శలు వచ్చాయి. కానీ ఎంఎస్ ధోనీ నేతృత్వంలో పృథ్వీ షా తిరిగి ఫామ్‌లోకి రావచ్చని ఆశించవచ్చు. ప్రారంభంలోనే దాడికి దిగగల ఓపెనర్‌గా అతని సామర్థ్యం ఉన్నదే.
యశ్ ధూల్
యశ్ ధూల్ గత ఐపీఎల్ మ్యాచ్‌లలో (4 మ్యాచ్‌లు – 16 పరుగులు) పెద్దగా రాణించలేకపోయాడు. కానీ అతను కూడా ఒక అటాకింగ్ బ్యాట్స్‌మెన్. ఈ సీజన్లో చెన్నై టాప్ ఆర్డర్ చాలా సందర్భాల్లో మంచి స్టార్ట్‌ని బిగ్ స్కోరుగా మలచడంలో విఫలమవుతున్న నేపథ్యంలో, యశ్ ఢూల్ ఒక సరైన పరిష్కారంగా నిలవవచ్చు. అండర్-19 ప్రపంచ కప్ విజేత అయిన యశ్ ధూల్ కు అవకాశం ఇవ్వడం సమంజసం కావచ్చు.
అయుష్ మాఠ్రే
కేవలం 17 ఏళ్ల వయసు ఉన్న అయుష్ మాఠ్రే ముందున్న విజయవంతమైన కెరీర్‌కు శుభారంభం కావచ్చు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడే అవకాశం అనేది ప్రతి యువ క్రికెటర్ కలగంటాడు. 2024-25 విజయ్ హాజారే ట్రోఫీలో అయుష్ మాఠ్రే 7 ఇన్నింగ్స్‌ల్లో 458 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధశతకం ఉన్నాయి. 65.43 సగటుతో అతను రాణించడం విశేషం. ఈ ప్రతిభతో అతనికి చెన్నై తరఫున ఆడే అవకాశం లభించే అవకాశముంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..