
IPL 2025: ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ ఫర్ఫెక్ట్ అనే సామెత ఉంది. అంటే ఎవరైనా ఏ పనిలోనైనా నిష్ణాతులు కావాలంటే, ఎంతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే పరిపూర్ణ వ్యక్తిగా మారుతుంటారు. ఇది క్రికెట్‌కు కూడా వర్తిస్తుంది. ఓ క్రికెటర్ ఎంత కఠినంగా ప్రాక్టీస్ చేస్తే, అంత రాటుదేలుతుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కోసం సాధన చేయని ఆటగాడు కూడా ఉన్నాడని మీకు తెలుసా. మరో కీలక విషయం ఏమిటంటే ఈ ప్లేయర్ మ్యాచ్‌కు ముందు ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదంట. అయినప్పటికీ, అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుగాంచాడు. కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2025లో అతనికి రూ. 12 కోట్లు ఇస్తుంది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ గురించే మనం మాట్లాడుతున్నాం. అతని గురించి కేకేఆర్ మాజీ వికెట్ కీపర్ మన్వీందర్ బిస్లా షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఈ ఆటగాడు ఎప్పుడూ ప్రాక్టీస్ చేయడని, నెట్స్‌లో బౌలింగ్ అస్సలు చేయడని, ఇదే అతని విజయ రహస్యమని బిస్లా చెప్పుకొచ్చాడు.
నరేన్ గురించి బిస్లా షాకింగ్ విషయాలు..
మన్వీందర్ బిస్లా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘సునీల్ నరైన్ నెట్స్‌లో ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడు. ముందుగా, అతనికి నెట్స్‌లో బౌలింగ్ చేయాలని అనిపించదు. రెండవది, భవిష్యత్తులో అతను ఇతర జట్లతో ఆడనున్నందున బ్యాట్స్‌మెన్స్ తన బంతులను అర్థం చేసుకోవాలని అతను కోరుకోడు. తాను కేకేఆర్ వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు, నరైన్‌ను 12-13 బంతులు వేయమని అడిగాను. తద్వారా అతని వైవిధ్యాలను అర్థం చేసుకోవచ్చని అనుకున్నాను’ అంటూ మన్వీందర్ బిస్లా వెల్లడించాడు. అయితే, నరైన్ మాత్రం వేరియేషన్స్ తో బౌలింగ్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ జట్టులో నరైన్ కీలక ప్లేయర్..
సునీల్ నరైన్ కేకేఆర్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఈ ఆటగాడు గత కొన్ని సంవత్సరాలుగా కేకేఆర్ అనుబంధం కలిగి ఉన్నాడు. అతను జట్టులో ఒక మిస్టరీ స్పిన్నర్‌గా చేరాడు. నేడు అతను ఒక తుఫాను ఆల్ రౌండర్‌గా మారాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేలా ప్రేరేపించింది. అతను బ్యాట్‌తో కేకేఆర్ తరపున అనేక మ్యాచ్‌లను గెలిపించాడు. గత సీజన్లో నరైన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. గత సీజన్లో నరైన్ 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 488 పరుగులు చేశాడు. కేవలం 6.69 ఎకానమీ రేట్‌తో 17 వికెట్లు కూడా పడగొట్టాడు. నరేన్ విజయానికి కారణం అతను తన సహచరులను నమ్మకపోవడమే. నిజంగా చెప్పాలంటే, నరైన్ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్, అందుకే అతని ప్రదర్శన ప్రతి సీజన్లో అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..