
ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో..ఎల్ఎస్జీ ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ గెలుపు తర్వాత లక్నోకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సీజన్లో ఇదే అతనికి మొదటి నేరం కావడంతో, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ పేర్కోంది. కాగా ఐపీఎల్ 2025లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న మూడవ కెప్టెన్ రిషబ్ పంత్. ఇప్పటి వరకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్‌కు బీసీసీఐ జరిమానా విధించింది.
మరోవైపు, లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీకి వరుసగా రెండో సారి బీసీసీఐ జరిమానా విధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటర్ నమన్ ధీర్‌ను.. దిగ్వేష్ సింగ్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ పడగానే దిగ్వేష్ తన స్టయిల్లో నోట్ బుక్‌లో లెక్కలు రాసుకుంటూ సెలబ్రేషన్స్ చేశాడు. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1ని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. ఈ సీజన్లో దిగ్వేష్‌కు ఇది రెండో జరిమానా.. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే తప్పు చేసినందుకు బీసీసీఐ అతనికి జరిమానా విధించింది. దీంతో దిగ్వేష్‌కు బీసీసీఐ 3 డీమెరిట్ పాయింట్లను కేటాయించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వగా..ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జరిమానా కారణంగా మరో రెండు డీమెరిట్ పాయింట్లను యాడ్ చేసింది. దీంతో దిగ్వేష్ ఖాతాలో ప్రస్తుతం 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.