
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో వరుసగా రెండు పరాజయాల తర్వాత, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 20 పరుగులు అవసరం. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్ రాజస్థాన్ తరపున మాస్టర్ స్ట్రోక్‌గా మారాడు. ఈ మాస్టర్ స్ట్రోక్ ముందు మహి మ్యాజిక్ కూడా పని చేయలేదు.
సీఎస్కే మాజీ కెప్టెన్ ధోని చాలా మందికి ఆదర్శం అనే సంగతి తెలిసిందే. ఇది కేవలం అభిమానులు మాత్రమే కాదండోయ్.. ఈ లిస్ట్‌లో చాలామంది క్రికెటర్లు కూడా ఉన్నారు. ధోనిని తన అభిమాన వ్యక్తిగా భావించి పెరిగిన వారిలో రియాన్ పరాగ్ కూడా ఒకడు. చిన్నప్పుడు ధోనితో ఫొటో కోసం తహతహలాడిన పరాగ్.. ఇప్పుడు ఏకంగా ధోని జట్టునే ఓడించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో చెన్నైపై విజయం తర్వాత పరాగ్ చిన్నప్పుడు ధోనితో తీసుకున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్ ముందు ఇదేం యాటిట్యూట్.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు
ధోనితో రియాన్ ఫొటో..
Dhoni was playing IPL, when Riyan Parag was a child , Dhoni is still playing IPL 😏#CSKvsRR #SRHvsDC pic.twitter.com/agoVBsqX4A
— Cricket Legends (@CricketLegende) March 30, 2025
43 ఏళ్ల ఎంఎస్ ధోని 2004లో క్రికెట్లోకి అడుగుపెట్టినప్పుడు పరాగ్ వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆసక్తికరంగా, రియాగ్ తండ్రి పరాగ్ దాస్ కూడా రంజీ ట్రోఫీలో ధోనితో ఆడాడు. 1999-2000లో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ధోనిపై పరాగ్ దాస్ అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను అస్సాం జట్టు తరపున 43 ఫస్ట్-క్లాస్, 32 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధోని రియాగ్ తండ్రిని స్టంప్ చేశాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: కావ్య మారన్ బృందానికి బెదిరింపులు.. కట్‌చేస్తే.. ఉప్పల్ నుంచి తరలనున్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జరిగిన 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో రాజస్థాన్ హ్యాట్రిక్ పరాజయాలను తప్పించుకుంది. రాజస్థాన్ జట్టు తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను అందుకుంది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయే ప్రమాదం ఉంది. కానీ, చివరి ఓవర్లో రాజస్థాన్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ధోని అవుట్ కావడంతో రాజస్తాన్ రాయల్స్ ఎట్టకేలకు తమ తొలి విజయాన్ని అందుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..